తెలంగాణ వీణ , హైదరాబాద్ : అమలు కాని హామీలను ఇస్తు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల మాయమాటలను ప్రజలు నమ్మొద్దని బీఆర్‌ఎస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నస్కల్, నందగోకుల్, నగరం, జడ్చెరువు తండాలో పర్యటించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యేపద్మాదేవేందర్‌రెడ్డికి ప్రజలు అప్యాయంగా మంగళహారులతో స్వాగతం పలికారు.
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నది బీఆర్‌ఎస్సే అని, ఎమ్మెల్యేల టికెట్లు అమ్మకున్నది కాంగ్రెస్ అన్నారు. మూడు పంటలకు సరిపడా కరెంట్ ఇస్తూ కర్షకుల కడుపు నింపడా నికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే, మూడు గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్‌రెడ్డి కారు కూతలు కూస్తున్నా రని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి గొడువలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. 13 ఏండ్లుగా గుర్తుకు రాని మెదక్ నియోజకవర్గం ఇప్పుడు కొడుకు కోసం వచ్చాడని, ఎన్నికల్లో గెలవడానికి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. రైతుబం ధు పథకాన్ని ఆపేయాలని ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులకు ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్ణాటక గతే పడుతుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారుకే ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే తెల్లరేషన్ కార్డుపై ప్రతి సన్నబియ్యం, రూ.400 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.