తెలంగాణ వీణ, మెదక్ : ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి వ్యక్తి పై రెండు లక్షల అప్పు చేశారని నర్సాపూర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మురళి యాదవ్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం యశ్వంత్ రావు పేట, ఎం జలాల్పూర్, కుక్కునూరు, దామరంచ, అక్కంపల్లి ,ధర్మారం, అందుల పల్లి తండా, పెద్దమ్మ గడ్డ తండా, రెడ్డిగూడెం ,మానేపల్లి తండా గ్రామాలలో మురళి యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు యువతకు ఉద్యోగాలు కల్పించకుండా తాగుబోతులను తయారు చేసిందని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల చెంది అధ్యక్షుడు నర్సింలు. జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్. జిల్లా కిషన్ మోచ అధ్యక్షుడు జనార్ధన్. ఎల్లం నవీన్ విక్రమ్ కిచిగారి గోనేష్ మాజీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మల్లేష్ ఇతర బిజెపి కార్యకర్తలు
Tweetకేసీఆర్ ప్రతి వ్యక్తి పై రెండు లక్షల అప్పు వేసాడు – మురళి యాదవ్ pic.twitter.com/2ZavVx7qb3
— GS9TV Telugu News (@Gs9tvNews) November 23, 2023