తెలంగాణ వీణ , సినిమా : అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా. నాగార్జున కొడుకుగా నట వారసత్వాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు నాగచైతన్య సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుంటూ యాక్టర్‌గా తనను తాను మరింత నిరూపించుకునేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉండే హీరోల్లో టాప్‌లో ఉంటాడు చైతూ. ప్రస్తుతం నాగచైతన్య చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు.
తాజాగా నాగచైతన్య నుంచి రెండు అప్‌డేట్స్ ఇప్పుడు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నటించిన వెబ్ ప్రాజెక్టు ధూత . ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ధూత తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 1 స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయాడు చైతూ.