తెలంగాణ వీణ , హైదరాబాద్ : మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డిలపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డిది తన స్థాయి కాదని అన్నారు. ఆయనకు చదువు రాదని, ఒక బఫూన్ అని విమర్శించారు. రాజకీయాల్లో మల్లారెడ్డి ఒక బిచ్చగాడని అన్నారు. ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. తాను మాత్రం జాక్ ఆఫ్ ఆల్ అని చెప్పారు. రాజకీయాల్లోనే కాకుండా క్రీడల్లో కూడా తాను ఫస్టేనని అన్నారు. క్రికెట్లో తాను ఓపెనర్ గా వెళ్లి నాటౌట్ గా వచ్చేవాడినని చెప్పారు. వాలీబాల్ టీమ్ ను కూడా తానే లీడ్ చేసేవాడినని తెలిపారు. మల్లారెడ్డికి డ్యాన్స్ లు తప్ప మరేమీ రావని అన్నారు. పాలమ్మినా, పూలమ్మినా అంటాడని… ఆయనకు సబ్జెక్ట్ లేదని చెప్పారు. హరీశ్ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హరీశ్ తో పాటు మల్లారెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు.