తెలంగాణ వీణ . ఏపీ బ్యూరో : యూట్యూబ్ వీడియోలు చూసేవారికి ‘నా అన్వేషణ’ చానల్ గురించి తెలిసే ఉంటుంది. ఓ యువకుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, తనకు తోచినట్టుగా మాట్లాడుతూ, కొన్నిసార్లు ఘాటైన పదాలు ఉపయోగిస్తూ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. ‘నా అన్వేషణ’ యూట్యూబ్ చానల్ కు 18 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
అయితే, ఈ యూట్యూబ్ చానల్లో ఇటీవల రాజకీయపరమైన అంశాలతో కూడిన వీడియో ఒకటి దర్శనమిచ్చింది. అందులో జింబాబ్వే దేశంలోని అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులను, ఏపీ పరిస్థితులను పోల్చడం కనిపిస్తుంది. అయితే, ‘నా అన్వేషణ’ చానల్ కు నారా లోకేశ్ రూ.5 కోట్లు ఇచ్చాడంటూ ఓ పత్రికలో వచ్చింది. నారా లోకేశ్ డబ్బిచ్చి అతడితో ఆ విధంగా చెప్పించాడన్నది ఆ పత్రికా కథనం సారాంశం. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. “వైసీపీ ఎప్పుడో దిగజారిపోయింది. ఇంతకంటే ఇక దిగజారడానికి ఏమీ లేదు.