తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : నియోజకవర్గంలో ఉన్న ముదిరాజ్ లందరూ మేకల సారంగపానికి ఓటు వేసి గెలిపించాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నగేష్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ బీసీ అభ్యర్థనీ సీఎం గా ప్రకటించడం తర్వాత బిజెపికి మద్దతు తెలుపుతున్నారని బిజెపి అభ్యర్థి మేకల సారంగపాని అన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల లో తెలంగాణలో ఏనాడు బిసి అభ్యర్థి సీఎం కాలేదని ఇప్పుడు సీఎం అయ్యే సమయం వచ్చిందని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ చైతన్యవంతులై బీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సికింద్రాబాద్ లో కమలం గుర్తుకు ఓటు వేసి సారంగపాణిని గెలిపించాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.
Tweetబిజెపి సికింద్రాబాద్ అభ్యర్థి మేకల సారంగపాణి కి మద్దతు ప్రకటించిన ముదిరాజ్ సంఘం pic.twitter.com/vSDGEt5rC1
— GS9TV Telugu News (@Gs9tvNews) November 21, 2023