తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఉదయం షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఆమె గన్‌మెన్ ఫాజిల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్‌లో ఫాజిల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సమాచారం అందుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ చేసుకోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మరోవైపు వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు ఆరా తీశారు. ఫాజిల్ బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.అయితే ఆర్థిక సమస్యలా? కుటుంబ కలహాలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడితో మాట్లాడిన అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.