Wednesday, December 25, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి

Must read

తెలంగాణ వీణ, సూర్యాపేట : మైనార్టీల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని రాష్ట్ర మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి , మాట్లాడుతూ గతంలో పరిపాలించిన పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్‌ గానే చూశాయి తప్పా వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మైనారిటీల బతుకులు మారలేదు ,వెలుగులు కానరాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. షాదీముబారక్‌, మైనారిటీ గురుకులాలు, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు, ఇమామ్‌, మౌజన్‌కు గౌరవవేతనం, హజ్‌ యాత్రికులకు ఏర్పాట్లు, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, మైనార్టీ బంధు లాంటి అనేక కార్యక్రమాలు మైనారిటీల ప్రగతికి మైలురాయిగా నిలుస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చినవేగాక ఇవ్వని హామీలు సైతం అమలు చేస్తూ మైనారిటీ జీవితాల్లో వెలుగు నింపుతున్నదన్నారు..బీఆర్ఎస్ హయాం లోనే ముస్లీం ల అభివృద్ధి సాధ్యం అన్న మంత్రి, సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని గుర్తించాలని కోరారు. మైనార్టీ వర్గం నిండు మనసుతో ఆశీర్వదిస్తే సేవకుడిగా పని చేస్తానని హామీ ఇచ్చారు. భీఆర్ఎస్ సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ టిఆర్ఎస్ గెలుపులో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన మైనార్టీ యువకులు అక్రం, రియాజుద్దిన్ తదితరులు టిఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువాతో మంత్రి స్వాగతం పలికారు.కార్యక్రమం లో మైనార్టీ నాయకులు రియాజ్, అజీజ్, కౌన్సిలర్లు తాహెర్ పాష ,జహీర్,అయూబ్ ఖాన్, తాహిర్ ,జలీల్ పాషా, ఉర్దూగర్ చైర్మన్ కరాటే సయ్యద్, మోయినుద్దిన్, జలీల్ ,రఫీ, రెహమాన్, గౌస్ ఖాన్,సయ్యద్ సలీం, ముజీబ్, జానీ బాయ్, గాలీభ్ బాయ్ తదితరుల పాల్గోన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you