తెలంగాణ వీణ , హైదరాబాద్ : నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఎగిసిపడుతున్న మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. ఇప్పటికి ఏడుగురు మృతిచెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంకా భవనంలో దట్టమైన పొగ అలుముకుంది.
ఇక, అపార్ట్‌మెంట్‌లో కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం. రెస్య్కూ సిబ్బంది ఇప్పటికి 21 మందిని కాపాడింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఎనిమిది మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళలు, చిన్నారులు ఉన్నట్టు సమాచారం.
ప్రమాదంలో మృతి చెందిన వారు వీరే..
తూభ(5)
తరూభ(12)
మహ్మాద్ ఆజమ్ (54),
రెహమాన్,
రెహానా సుల్తానా(50)
డాక్టర్ తహుర ఫర్హీన్(38),
ఫైజా సమీన్(25)
సెలవుల కారణంగా పిల్లలతో పాటు బంధువుల ఇంటికి వచ్చిన డాక్టర్ ఫరీన్.
మూడవ అంతస్తులో :
జకీర్ హుస్సేన్
నిక్కత్ సుల్తానా