తెలంగాణ వీణ, సనత్ నగర్ : బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని బన్సీలాల్ పేట్ “సి” క్లాస్, బండ మైసమ్మ నగర్, బిజేఆర్ నగర్, ముస్లిం బస్తి, న్యూ బోయగూడా మసీద్ ప్రాంతాలలో స్థానిక బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలతో కలిసి ప్రతి ఇంటిని ప్రతి ఓటర్ ని పలకరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ పర్యటించారు. మీడియాతో మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గంలో దౌర్జన్యం, దోపిడీ బెదిరింపులకు, మంత్రి తలసాని తమ్ముళ్లు పాల్పడుతున్నారని. గతంలో ఆయన తమ్ముడు చేసిన హత్యలో తాను ముందు ఉండి బాధితులకు న్యాయం జరిగేలా చూసానని అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలో సట్టా జూదం, గంజాయి అమ్మకాలు, అధికంగా పెరిగాయని భయభ్రాంతులకు గురవుతున్నారని గతంలో వారిపై చర్యలు తీసుకునే విధంగా నియోజకవర్గంలో ఎంతో కృషి చేశానని అన్నారు. ప్రజలు ఈసారి నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్నారని ప్రచారంలో ఏ ఇంటికి వెళ్లిన కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని అన్నారు.
Tweetసనత్ నగర్ నియోజకవర్గంలో మర్రి శశిధర్ రెడ్డి ప్రచారం pic.twitter.com/KfqKghDxqD
— GS9TV Telugu News (@Gs9tvNews) November 23, 2023