తెలంగాణ వీణ , మంచిర్యాల : బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రoలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సభలో నెన్నేల మండల యువ నాయకుడు హరీష్ గౌడ్ అధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గడ్డం వినోద్ మాట్లాడుతూ నేను మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో పనులు చేసాము…. 4500 కుటుంబాలకు పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ… ,ఇల్లు లేనివారికి ప్రతీ ఒక్కరికీ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ…. ఇలాంటివి ఎన్నెన్నో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ…. ఇప్పుడు నేను ఆస్తుల కోసం రాలేదు…., భూములను కబ్జా చేయడానికి రాలేదు…,దుర్గం చిన్నయ్య నన్ను నాన్ లోకల్ అన్నడే మరి లోకల్ లో ఉండి పది సంవత్సరాలు నువ్వు ఏం చేసావ్… ఏం అభివృద్ధి చేసావ్ అని ప్రశ్నించి ఇప్పుడు నేను ప్రజలకు సేవ చేయడానికి నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నేను ఎలా అభివృద్ది చేసి చూపిస్తా అని ప్రజల సాక్షిగా ప్రమాణం చేసిన గడ్డం వినోద్.ఈ కార్యక్రమంలో కారుకూరి రాంచెందర్, హరీష్ గౌడ్, నర్సింగరావు, సర్పంచులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.