తెలంగాణవీణ, మల్కాజిగిరి ; మల్కాజిగిరి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా ఎన్ . రాంచందర్ రావు నామినేషన్ దఖాలు చేశారు. ఆనంద్ బా గ్ చౌరస్తాలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. అదిష్టానం ఆదేశాల మేరకు ఎన్నికల బరిలో బలంగా ఆత్మవిశ్వాసంతో దిగుతున్నానన్నారు. మల్కాజిగిరి గడ్డపై ఈ సారి బిజెపి జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశఆరు. మల్కాజిగిరి ప్రజల కోరికపై కార్యకర్తల కోరికపై బిజెపి నుండి బరిలో దిగానని అన్నారు. మల్కాజ్గిరి నియోజవర్గంలో శాంతి, అభివృద్ధి కరువైందనీ, వాటి కోసం పోరాడుతానన్నారు.
జనసేన మద్దతుతో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు నామినేషన్
