తెలంగాణ వీణ, శామీర్‌పేట: బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్షంగా కార్యకర్తలు పనిచేయాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తుంకుంట మునిసిపల్ ఉప్పర్ పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోల మొల్ల లక్ష్మీ నారాయణ అనుచరులు 10 మంది బిఆర్ఎస్ పార్టీ లో చేరగా మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహనా కల్పించాలన్నారు. ప్రజలను చైతన్య పరిచి బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు లక్షంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనిత లాలయ్య, కౌన్సిలర్ పొల మొల్ల పండు, మాజీ సర్పంచ్ కట్టెల రవీందర్, అశోక్, వెంకటేష్, బాలు, యాదగిరి, నగేష్ తదితరులు పాల్గొన్నార