తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామా రావు ఈ నెల 18 వ తేదిన నిర్వహించే రోడ్ షో విజయవంతం చేయాలని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. రోడ్ షో ఏర్పాట్ల పై ఆయన బుధవారం అడ్డగుట్ట లో పర్యటించారు. కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ తో పాటు నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 18 వ తేదిన గోషామహల్, సికింద్రాబాద్ లలో కే టీ ఆర్ పర్యటించి పార్టీ విజయానికి ప్రచారం చేస్తారని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో రెండు ప్రదేశాల్లో రోడ్ షో సభలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుపుతున్నామని, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు.
Tweetకే టీ ఆర్ రోడ్ షో విజయవంతం చేయాలి : పద్మారావు గౌడ్ సూచన pic.twitter.com/dqgAzwEJsj
— GS9TV Telugu News (@Gs9tvNews) November 15, 2023