తెలంగాణ వీణ , హైదరాబాద్ :తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. స్వయం విశ్వాసాన్ని ప్రోత్సహించేందుకు స్థానిక వ్యాపారులు, తయారీదారులకు మద్దతు ఇవ్వాలని కోరారు.. సంకల్పం, చైతన్యంతో ముందుకు సాగేందుకు దీపావళి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. హిందూ సంస్కృతిలో దీపావళిని విజయానికి ప్రతీకగా భావిస్తారని, అది మన జీవితాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. బాణసంచా కాల్చేటప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని, తద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలని కోరారు.