తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజల సమయం కూడా లేదు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో, ప్రధాన పార్టీల నేతలందరూ సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జాతీయ పార్టీల అగ్రనేతలు సైతం వరుస సభలను నిర్వహిస్తున్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ విషయానికి వస్తే… రోజుకు మూడు, నాలుగు సభలతో ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. మరోవైపు, రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ భారీ బహిరంగసభ జరగాల్సి ఉంది. అయితే, ఈ సభ రద్దయింది. రేపు, ఎల్లుండి హైదరాబాద్ తో పాటు తెలంగాణకు వర్షసూచన ఉంది.