తెలంగాణ వీణ , నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబపై నిత్యం విమర్శలు గుప్పించే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన వ్యాఖ్యలు దేనికి సంకేతమని సొంతపార్టీ నేతల్లోనూ చర్చ మొదలైంది.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పోలిస్తే కేసీఆర్ కాస్తంత మంచోడేనని వ్యాఖ్యానించారు. రేవంత్ కేసీఆర్‌కు మించిన మోసగాడని విమర్శించారు. ఆయన మేడిగడ్డ వెళ్తే అక్కడి పిల్లర్లు మునిగిపోతాయని ఎద్దేవా చేశారు.