Sunday, December 22, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

హ్యాట్రిక్‌ వాకిట్లో కేసీఆర్‌..?

Must read

 తెలంగాణ వీణ , హైదరాబాద్ : వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి ఒక ముఖ్యమంత్రి హ్యాట్రిక్‌ సాధించడం ఒక అరుదైన రికార్డు. దక్షిణ భారతదేశంలో గతంలో ఒక్క ఎంజీఆర్‌ మాత్రమే వరుసగా మూడు ఎన్నికల్లో పార్టీని విజయపథంలోకి నడిపించారు. అయితే ఆయన పదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నారు. 1977లో ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న ఆయన ప్రభుత్వాన్ని 1980లో గవర్నర్‌ బర్తరఫ్‌ చేశారు.

గవర్నర్‌ పాలన అనంతరం 1980 ఎన్నికల్లో ఆయన పార్టీ మళ్లీ విజయం సాధించింది. 1984లో ఆయన మరోసారి గెలిచారు. 1987లోనే ఆయన చనిపోయారు. శిఖరప్రాయులైన తమిళ నాయకుడు సి. రాజగోపాలాచారి రెండేళ్లు, కామరాజ్‌ నాడార్‌ తొమ్మిదేళ్లు, అన్నాదొరై రెండేళ్లు మాత్రమే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కరుణానిధి సుదీర్ఘకాలం 17 సంవత్సరాల పాటు సీఎంగా చేసినప్పటికీ ఆయన నాయకత్వంలో వరుసగా రెండుసార్లు పార్టీ విజయం సాధించలేదు.

కర్ణాటకలో దిగ్గజ నాయకులైన నిజలింగప్ప, వీరేంద్రపాటిల్, దేవరాజ్‌ అర్స్, రామకృష్ణ హెగ్డేలకు ఎవరికీ ఈ ఘనత దక్కలేదు. కేరళలో ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని తదుపరి ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఘనత ప్రస్తుత సీఎం పినరయి విజయన్‌కే దక్కింది. ఈకే నయనార్, కరుణాకరన్‌లు పదేళ్లు అధికారంలో ఉన్నా వరుసగా లేరు. వివిధ సందర్భాల్లో మూడు విడతలుగా పనిచేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం కోసం నాటి హైదరాబాద్‌ స్టేట్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తన పదవిని త్యాగం చేశారు. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ పుట్టేవరకూ రాష్ట్రం కాంగ్రెస్‌ ఏలుబడిలోనే ఉన్నది. సంజీవరెడ్డి దగ్గర్నుంచీ విజయభాస్కరరెడ్డి దాకా ఏ ముఖ్యమంత్రి కూడా ఐదేళ్ల కాలం పని చేయలేదు. కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేళ్ల కాలం పని చేసినా ఒక ఎన్నిక దగ్గర్నుంచి మళ్లీ ఎన్నికల వరకు ఆయన పదవిలో లేరు. ఎన్టీఆర్‌ కూడా అంతే. వరుసగా ఐదేళ్లు లేరు. 1989లో ముందస్తుకు వెళ్లి ఓడిపోయారు. చంద్రబాబు నాయకత్వంలో తొలిసారి వాజ్‌పేయి అండతో గెలిచారు. ఆ తర్వాత ముందస్తుకు వెళ్లి ఓడిపోయారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you