తెలంగాణ వీణ , సినిమా : కన్నడ సినీ నిర్మాతను వలపు వలలో దించి ఆపై డబ్బు గుంజేందుకు ప్రయత్నించిన దర్శకుడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈజీగా డబ్బు సంపాదించాలన్న వక్రబుద్ధితో కన్నడ చిత్ర దర్శకుడు రవీంద్ర కొందరు అమ్మాయిలో కలిసి పథక రచన చేశాడు. నిర్మాత మహదేవ్ వద్దకు యువతులను పంపి ఆయనను ముగ్గులోకి దింపాడు. తమ పథకం పారిన తర్వాత వారు తమ వికృత రూపాన్ని బయటపెట్టారు. డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టారు. అడిగిన మొత్తం ఇవ్వకుంటే లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరించారు.