తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రైతులను రెచ్చగొట్టేవిధంగా ఎల్లో మీడియా కుట్రలు చేస్తుందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అసత్య ప్రచారంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగు రైతు స్టీరింగ్ కమిటీ పేరుతో ఏముఖం పెట్టుకుని రైతుల దగ్గరికి వెళ్తున్నారో చెప్పాలంటూ టీడీపీ నేతల్ని మంత్రి దుయ్యబట్టారు.
‘‘అన్ని రకాలుగా అన్నదాతలను చంద్రబాబు మోసం చేశారు. కొత్త ఎత్తుగడలతో మరోసారి రైతుల ముందుకు వస్తున్నారు. చంద్రబాబు మొసలి కన్నీరు చూసి మోసపోవద్దు’’ అని కాకాణి పేర్కొన్నారు.
‘‘టీడీపీ హయాంలో రైతులను అడుగడుగునా దోచుకున్న మాట వాస్తవం కాదా? అని కాకాణి ప్రశ్నించారు. ఖరీఫ్, రబీలో ఏ పంటలు పండిస్తారో కుడా పరిజ్ఞానం లేని లోకేష్.. లేఖలు రాయడం సిగ్గు చేటు. రాష్టంలో కరువు రావాలని కోరుకున్న వ్యక్తి రామోజీరావు.. అందుకే విధి విధానాలు తెలియకుండానే.. కరువు మండలాలు ప్రకటించాలని వార్తలు రాస్తున్నారు’’ అని మంత్రి నిప్పులు చెరిగారు.