తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే, ఐటీ కంపెనీలు మాత్ర సెలవు ఇవ్వకపోవడంతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి వికాస్‌రాజ్ రంగంలోకి దిగారు. పోలింగ్ రోజైన రేపు (నవంబర్ 30)న అన్ని సంస్థలు, కంపెనీలు, సెలవు ప్రకటించినదీ, లేనిదీ నిర్ధారించుకోవాలని లేబర్ కమిషన్‌ను ఆదేశించారు. ఒకవేళ సెలవు ప్రకటించని పక్షంలో ఎలక్టోరల్ లా, లేబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంటు ఎన్నిక సమయంలోనూ చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ఇవ్వకుండా పనిచేయించుకున్నాయి. ఉద్యోగుల ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఓటు హక్కు వినియోగించుకోలేపోయామన ఆవేదన వ్యక్తం చేశారు.