తెలంగాణ వీణ, కాప్రా : కాప్రా డివిజన్ కందిగుడలోని అతి పురాతనమైన ఆలయంలో నూతన విగ్రహల ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. వెల్తూరి ప్రసాదాచార్యులు గేయ శాస్త్రానుసారం ప్రత్యేక విగ్రహ ప్రతిష్ట కత్రువును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విగ్రహమూర్తుల దాన్యాధివాసం, యాగశాల ప్రవేశం , ప్రత్యేక హోమాది పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామ తోరణం, గణపతి పూజ, పుణ్యా వచనము, గోపూజ, దీక్ష కంకరణ ధారణ, యాగశాల ప్రవేశము, పంచగవ్య ప్రాశన, నవగ్రహ వాస్తు సర్వతోభద్ర మండల ఆరాధన, ఉపవేదిక ఆరాధన అఖండ దీప ప్రజ్వలన, బ్రహ్మ కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, గణపతి నవగ్రహ వాస్తు హోమాలు నిర్వహించారు. అనంతరం మహా నైవేద్యం మంత్రపుష్పనీరాజనం తీర్థప్రసాదాలను అందించారు. సాయంత్రం జలాధివాసం, జలాధివాస హోమము సర్వతోభద్ర మండల హోమాలు, మహా నైవేద్యం మంత్రపుష్ప నిరాజనం, తీర్థప్రసాదాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపార