తెలంగాణ వీణ, సినిమా : సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూ, వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె విపరీతమైన ట్రోలింగ్ ను కూడా ఎదుర్కొంటుంటారు. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్న సమయంలో… ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి తన డ్యాన్స్ గురించి అల్లు అర్జున్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని… ఏవైనా తప్పులుంటే తన నెక్స్ట్ మూవీలో ఆ తప్పులను సరిచేసుకుంటారని ‘పుష్ప’ సినిమాలో కొన్ని మిస్టేక్స్ చేశాడని, ‘పుష్ప2’ సినిమాలో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటున్నాడని ఆమె చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో, అనసూయపై బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనసూయ స్పందించింది. తాను అల్లు అర్జున్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పింది. తన మాటలను వక్రీకరించారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.