Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 అగ్ని ప్రమాదాలకు అడ్డగా హైదరాబాద్‌..

Must read

 తెలంగాణ వీణ , హైదరాబాద్ : నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని సంచలన కామెంట్స్‌ చేశారు. 

కాగా, నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్‌ మాట్లాడుతూ..‘హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఈ జరిగిన అ‍గ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. రెసిడెన్షియల్‌ ఏరియాలో కెమికల్‌ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు. 

ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you