తెలంగాణ వీణ , సినిమా : కెరీర్‌లో తాను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని ప్రముఖ నటుడు, తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ తెలిపాడు. ఒకానొక సమయంలో తన బ్యాంక్ అకౌంట్లో రూ.18కి మించి లేవని చెప్పాడు. ఓ దారుణ అనుభవం తరువాత డబ్బు గురించి ఆలోచించకుండా మంచి పాత్రల్లోనే నటించేందుకు నిర్ణయించుకున్నానని వెల్లడించాడు.
‘‘అప్పట్లో నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. నా బ్యాంకు అకౌంట్లో రూ.18 మాత్రమే ఉండేవి. ఆ టైంలో నాకు మంచి అవకాశాలు కూడా రాలేదు. కొందరు నన్ను రిపోర్టర్ పాత్రలో నటించమని కోరారు. ఒక్క రోజే షూటింగ్.. మూడు వేలు ఇస్తామన్నారు. అలాంటి పాత్రలు ఇష్టం లేకపోయినా డబ్బు కోసం ఓకే చెప్పాను. షూటింగ్ రోజున రిపోర్టింగ్ ఇంగ్లిష్‌లో చేయమన్నారు. అది అంత ఈజీగా లేకపోవడంతో సెట్‌లోనే నన్ను రిజెక్ట్ చేశారు’’