తెలంగాణ వీణ , సినిమా : సుధీర్ బాబు హీరోగా ‘హరోం హర’ సినిమా రూపొందింది. సుమంత్ జీ నాయుడు నిర్మించిన ఈ సినిమాకి, జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఆయన జోడీగా మాళవిక శర్మ నటించిన ఈ సినిమాకి, చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు.
1989లో చిత్తూరు జిల్లా పరిధిలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగు టీజర్ ను ప్రభాస్ .. తమిళంలో విజయ్ సేతుపతి .. మలయాళంలో మమ్ముట్టి .. కన్నడలో సుదీప్ .. హిందీలో టైగర్ ష్రాఫ్ రిలీజ్ చేశారు.