తెలంగాణ వీణ , హైదరాబాద్ : మరో రెండు రోజుల్లో అంటే.. నవంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని సంస్థలు సెలవు ఇవ్వాని ఆదేశించారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఎన్నికల వేళ (2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ) కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు సీఈవో తెలిపారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు.