తెలంగాణ వీణ , సినిమా : బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపింది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమా అవకాశాలు దక్కించుకుని ఆపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో అడుగుపెట్టి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న బ్యూటీ శ్వేతా వర్మ.. వెండితెరపై హీరోయిన్‌గా, సైడ్ ఆర్టిస్ట్‌గా ఇలా చాలా పాత్రలను పోషించింది. కానీ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా శ్వేతా వర్మ తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఆమె ఇలా చెప్పింది.
ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం మా ఇంట్లో జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. దీంతో రూం మొత్తం కాలిపోయింది. నా ఫ్యామిలీతో పాటు.. నా పెట్స్ కూడా సేఫ్‌గానే ఉన్నాయి. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి నేను కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. దయచేసి నా కోసం మీరు ప్రార్థించండి. ఆందోళన వద్దు. మేము ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం. కొద్దిరోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియా ద్వారా మీకు టచ్‌లోకి వస్తాను.’ అంటూ శ్వేతా వర్మ తెలిపింది.