తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : చంద్రబాబు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్ ఫిర్యాదుతో క్రైం నంబర్ 531\2023 కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 341, 290, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రెండు గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్ చేసి ప్రజలను ఇబ్బందులను గురిచేశారని చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.