తెలంగాణ వీణ , హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రానున్నారు. 7వ తేదీతో పాటు 11వ తేదీన నిర్వహించే సభలోనూ ఆయన పాల్గొంటారు. ఈ తేదీల్లో హైదరాబాద్, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని అమిత్ షా ఇటీవల సభలో ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు.
నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 15వ తేదీ నుంచి జోరుగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం చేయనున్నారు. 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ఉధృతమయ్యాక 19న మరోసారి ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు.