తెలంగాణ వీణ , క్రీడలు : ఈ ప్రపంచకప్ సందర్భంగా భారత జట్టు డ్రెస్సింగ్ రూం సెలబ్రేషన్స్ అనే కొత్త సంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఫీల్డింగ్‌లో ప్రతిభ చూపించిన ఆటగాడిని మెడల్‌తో సత్కరిస్తూ వస్తోంది. తాజాగా, ఫైనల్ మ్యాచ్ అనంతరం కూడా సెలబ్రేషన్స్ నిర్వహించింది. అయితే, ఈసారి బరువెక్కిన హృదయాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
మరోమారు విరాట్ కోహ్లీకే మెడల్ సొంతమైంది. రవీంద్ర జడేజా మెడల్‌ను కోహ్లీ మెడలో వేసి అభినందించాడు. కోహ్లీ మెడల్ అందుకోవడం ఇది రెండోసారి. ఈ వేడుకతోపాటు మొదటి నుంచి జరిగిన డ్రెస్సింగ్ రూమ్ సెలబ్రేషన్స్ వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది.