తెలంగాణ వీణ , ఉప్పల్ : ఈరోజు మార్నింగ్ వాక్ విత్ బిఎల్ఆర్ ప్రచారంలో భాగంగా రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల మరియు హబ్సిగుడ రవీంద్ర నగర్ కాలనీ, కెప్టెన్ వీరరాజా రెడ్డి పార్క్ లో, మార్నింగ్ వాకర్స్, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ మరియు యోగ, మెడిటేషన్ చేస్తున్న వాళ్లందరినీ బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి ఆత్మీయంగా కలుస్తూ ప్రచారం చేశారు .
ఈ ప్రచారంలో బండారి లక్ష్మారెడ్డి వినూత్నంగా కర్ర సాము చేస్తూ ఘనంగా స్వాగతం తెలిపారు.ఈ నేపథ్యంలో, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని, అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరిస్తూ, ఉప్పల్ నియోజకవర్గంలో మరింత అభివృద్ది జరగాలంటే అది కేవలం బిఅర్ఎస్ పార్టీ కేసీఆర్ తో మాత్రమే సాధ్యం అంటూ, కాంగ్రెస్, బిజెపి పార్టీల అమలుకాని హామీలు నమ్మి గొసపడొద్దంటూ, తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరింగిందో ఒక్కసారి ఆలోచించి, ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని బండారి లక్ష్మారెడ్డి అభ్యర్ధించారు. ఈ ప్రచార కార్యక్రమంలో డివిజన్ ప్రసిడెంట్ బి.వి.చారి, సోమిరెడ్డి, పి.రవీందర్ రెడ్డి, పి.నాగేష్, కాలేరు జై నవీన్, ప్రభాకర్, బాబు యాదవ్, బాలరాజు యాదవ్, ముస్తాక్, కైలాష్ పతి, చిన్న తదితరులు పాల్గొన్నారు.