తెలంగాణ వీణ , సినిమా : రేణుదేశాయ్ ఒకట్రెండు సినిమాలు తప్ప ఏమీ చేయలేదు. తరువాత పవన్ కళ్యాణ్‌తో పెళ్లి, పిల్లలు, విడాకులు అంతే. ఇక ఆమె లోకమంతా పిల్లలే. మరి రేణుదేశాయ్ లైఫ్ గడవడానికి ఇన్నాళ్లూ ఏమి చేశారు. సినిమాలు చేయట్లేదు. ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు. వాళ్ల లైఫ్‌ను వాళ్లు లీడ్ చేసే ఏజ్‌లో ఉన్నారు. మరి రేణుదేశాయ్ ఖాళీటైంలో ఏంచేస్తారు?.. ఫ్రీటైంలో రేణుదేశాయ్ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ఇది చాలామందికి తెలియదు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. వాళ్ల నాయనమ్మ, నాన్న కూడా ఇదే వ్యాపారం చేస్తారట. కట్టిన విల్లాలు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లు కొనడం మంచి రేటు వచ్చినపుడు అమ్మడం.. ఇదే చేస్తుందట. హైదరాబాద్, పూణెల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని రేణు చెప్పారు.
ఇక పోతే.. 20 ఏళ్ల తరువాత రేణుదేశాయ్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. రివితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఓ ఫ్రీడమ్ ఫైటర్ రోల్ చేశారట. ఆమెకు డైరెక్షన్ అంటే ఇష్టమట. అందుకే సినిమా నిర్మాణం, దర్శకత్వంలో రాణించేందుకు హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయ్యాను అని పవ్‌న్ కళ్యాణ్ మాజీ బార్య చెబుతున్నారు.