తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి పై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిమండిపడ్డారు. ధర్మారెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, సమయం, వేదిక ఎప్పుడు చెప్పినా తాను సిద్ధమని సవాల్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒక దొంగని.. ఆయనకు అర్హత లేదని తెలిసినా.. ఈవోగా నియమించారని విమర్శించారు. ఢిల్లీ కేంద్రంగా రక్షణశాఖలో ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేశారని, ధర్మారెడ్డిది మున్సిపాలిటీలో సర్వేయర్ స్థాయి మాత్రమేనని అన్నారు. చీఫ్ సెక్రటరీ స్థాయి తనకుందని ధర్మారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. సీనియర్ ఐఏఎస్‌లకే టీటీడీ ఈవోగా అర్హత ఉంటుందని, ఐఏఎస్ కాని ధర్మారెడ్డి.. టీటీడీ ఈవోగా ఎలా అర్హులని ప్రశ్నించారు. ధర్మారెడ్డి కోసం తిరుమలలో ఫేక్ పోస్టు సృష్టించారని, టీటీడీ ఈవోగా పనిచేసేందుకు ధర్మారెడ్డికి అర్హతే లేదన్నారు. ఢిల్లీలో జగన్‌కు బ్రోకరేజ్ చేస్తున్న ధర్మారెడ్డిని తొలగించాలని, టీటీడీ ఆర్థిక లావాదేవీలపై విచారించాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.