తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ నుంచి కాపాడుకోవడానికి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. స్కామ్ నుంచి కవితను తప్పించడానికి బీజేపీకి దాసోహమయ్యారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితను అరెస్ట్ చేయలేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని చెప్పారు. కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చి ప్రచారం చేయాలని, ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కేసుల కోసం ప్రధాని మోదీ కాళ్ల ముందు ఆయన తల వంచారని అన్నారు. కేంద్రం కాళ్లపై పడటం వల్లే పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని చెప్పారు.