తెలంగాణ వీణ , నిజామాబాద్ జిల్లా : కాంగ్రెస్ మొసలి కన్నీళ్లకు బలైతే ఐదేళ్లు బాధ పడతారని, 11 సార్లు పాలించిన కాంగ్రెస్ పాలనలో కరెంట్ సరిగ్గా లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
నిజామాబాద్‌లో మంగళవారం ఉదయం ఆమె మీడియా సమా వేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్లతో డ్రామాలు చేస్తున్నారన్నారు.
30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నాయకులకు బాండ్ పేపర్లు రాసిచ్చే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. కర్ణాటకలో ఇలాగే బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పా రన్నారు.
9 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని, 50 ఏళ్లలో 41 రిజర్వా యర్‌లు నిర్మిస్తే 9 ఏళ్లలో 107 రిజర్వాయర్‌లు బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించామని పేర్కొన్నారు.
పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు దిగజారి మోసం చేస్తారన్నారు. కర్ణాటకలో సంతకాలు చేసి 100 రోజులు అవుతున్నా ఒక్క కార్యక్రమం కూడా మొదలు పెట్టలేదన్నారు.
మోదీ అధికారంలో ఉన్న కేంద్రంలో 13 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. తెలంగాణకు వచ్చి యువతతో సమావేశాలు నిర్వహించి రెచ్చ గొడు తున్నారని మండిపడ్డారు.