తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతుల నోటికాడ బుక్కను గుంజుకుందని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు వెంబటబడి రైతు బంధును నిలిపివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. రైతు బంధు ఎన్నికల కోసం పెట్టిన పథకం కాదని చెప్పారు. ఇప్పటికే రూ.72 వేల కోట్లు రైతుబంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేశామన్నారు. రైతులంతా బీఆర్‌ఎస్ వైపు ఉన్నారన్న అభద్రతలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని విమర్శించారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ మరోసారి రైతులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించిందన్నారు. అన్నదాతలంతా ఓటు ద్వారా ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. రైతుబంధు కావాలా.. రాబందులు కావాలా అని ప్రశ్నించారు.
సింగరేణిని ప్రైవేటుకు అప్పగించిందే హస్తంపార్టీ అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ప్రియాంకా గాంధీ చదువుతున్నారని ఎద్దేవాచేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన లేదన్నారు. బీజేపీని కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రెండు పార్టీల నేతలంతా ఎక్కడున్నారని నిలదీశారు. బీజేపీ హయాంలో బాగుపడ్డది కేవలం కార్పొరేట్లు మాత్రమేనని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. చెందిందన్నారు.