తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధ్యక్షు డు చంద్రబాబుకు సీఐడీ మరో షాకిచ్చిం ది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన కేసులో చంద్రబాబును సీఐడీ ఏ2గా చేర్చింది. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ3గా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏ4గా మాజీ మంత్రి దేవినేని ఉమ ఉన్నారు.
ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారన్న ఆరోపణపై ఈ కేసు నమోదు చేసినట్టు సీఐడీ పేర్కొంది. ఇప్పటికే చంద్రబాబుపై అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్, స్కిల్ డెవలప్‌మెంట్, అసైన్డ్ ల్యాండ్స్, ఫైబర్‌నెట్ కేసులు విచారణలో ఉన్నాయి.