తెలంగాణ వీణ , హైదరాబాద్ : చిలుకానగర్ డివిజన్, నోవా బ్యాంకెట్ హాల్ లో నెర్ధం భాస్కర్ గౌడ్ అద్వర్యంలో నిర్వహించిన
గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి విచ్చేసి,బహుజన వీరుడు సర్వాయి పాపన్న విగ్రహానికి పుల మాల వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ నేపథ్యంలో గౌడ సోదరుల సమస్యలన్నీ ఓపికగా అడిగి తెలుసుకుంటు వాటికి తగిన హామీలను ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేసిన గౌడ సోదరులు, ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఎల్ ఆర్ మాట్లాడుతూ గౌడ సోదరుల అడిగినట్లుగా ఎల్లమ్మ దేవాలయం, కంఠ మహేశ్వర స్వామి దేవాలయంతో పాటు గౌడ సంక్షేమ భవనం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.