తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఏ అవినీతి చేయని తనను అన్యాయంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ తనకు సహకరించిన ప్రతి కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే ఈరోజు తనని ప్రజలతో కలిపిందని. అందుకు సహకరించిన జై భీమ్ భారత్ పార్టీ ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అన్యాయాన్ని ఎదిరించడంలో తనకు మద్దతునివ్వాలని శ్రవణ్ కుమార్‌ను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కోరారు. బాబు వ్యాఖ్యలపై స్పందించిన శ్రవన్ కుమార్ మాట్లాడుతూ.. వ్యక్తులు, వ్యవస్థల రాజ్యాంగ హక్కులు పరిరక్షించడంలో జై భీమ్ భారత్ పార్టీ ఎప్పటికీ సహకారంగా ఉంటుందని చెప్పారు. నిండు నూరేళ్లతో ఆరోగ్యంగా ఉంటూ చంద్రబాబు 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జడ శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు.