తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, చంద్రబాబుకు విధించిన బెయిల్ కండిషన్స్ పై ఆంక్షలు విధించాలని హైకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఆయన రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలు చేయకూడదని, మీడియాతో మాట్లాడకూడదని, ఇద్దరు డీఎస్పీలను ఆయనతో పాటు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో సీఐడీ కోరింది. మరోవైపు సీఐడీ విన్నపంపై చంద్రబాబు తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈరోజు తీర్పును వెలువరించనుంది.