తెలంగాణ వీణ,కాప్రా: ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుముల పరమేశ్వర్ రెడ్డి గెలిపించాలని కోరుతూ కాప్రా సినియర్ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కాప్రా డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తోటకూర శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే పార్టీ మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేస్తారని, అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినియర్ నాయకుడు నగేష్, ప్రశాంత్, సుమన్ రాజు జీవన్,కమలాకర్ తదితరులు పాల్గొన్నారు