తెలంగాణ వీణ,శామీర్‌పేట:ప్రజశీస్సులతో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతుందని బిఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండల కేంద్రంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రజశీస్సులతో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు జాము రవి, విష్ణువర్ధన్ రెడ్డి, సింగం ఆంజనేయులు, ఇస్తారి, ఎంపీటీసీ నాగరాజు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చిత్తా గౌడ్, యూత్ అధ్యక్షుడు నిరజ్ గౌడ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, ప్రభాకర్, రవీందర్ రెడ్డి, మురళి గౌడ్, నర్సింహా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.