తెలంగాణ వీణ , కూషాయిగూడ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరిరోజు కావడంతో ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు,ర్యాలీ లో సైనిక్ పురి చౌరస్తాలోని మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ చేపట్టిన బండారి లక్ష్మారెడ్డి, ఈ ర్యాలీ లో కొత్త రామారావు, పావని రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు.పాల్గొన్నారు ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటికే 25000 కోట్లతో అభివృద్ధి చేశారని, ఇంకా మిగిలి ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కేసీఅర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు చేరాయన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువులను సుందరీకరిస్తామని హామీ ఇచ్చారు. బీఎల్ఆర్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎందరో నిరుపేదలను ఆదుకుంటున్నామన్నారు. ఎంబీబీఎస్ సీట్లు వచ్చిన పేద విద్యార్థులకు ఎంత ఖర్చయినా తమ ట్రస్టు భరిస్తుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎక్కడున్నాయో వారికే తెలియదన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని బండారి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.