తెలంగాణ వీణ , హైదరాబాద్ : హబ్సిగూడ డివిజన్ స్ట్రీట్ నెంబర్ 8 హైమావతి రెసిడెన్సి వారు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ నియోజకవర్గం బి ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి,తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు . హైమావతి రెసిడెన్సి అధ్యక్షులు సీత , సెక్రెటరీ అరుణ్ కుమార్, మణికాంత్ లు ఏర్పాటుచేసిన సమావేశంలో బండారి లక్ష్మారెడ్డి ,రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని రెసిడెన్సివాసులను మద్దతు కోరడం జరిగింది దీనికి సానుకూలంగా స్పందించిన రెసిడెన్సి వాసులు తమ పూర్తి మద్దతు ఉప్పల్ నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి ఉంటుందని తెలియజేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి బండారి లక్ష్మారెడ్డి , రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ గడిచిన 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి పథంలో నిలిచింది అన్నది అందరికీ తెలిసిన విషయమన్నారు, ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను కరపత్ర రూపంలో పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు .ఈ కార్యక్రమంలో పసుల ప్రభాకర్ రెడ్డి, సంజయ్ జైన్, కాలేరు జె నవీన్, వీరేందర్, శ్యాంసుందర్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.