తెలంగాణ వీణ, కాప్రా : ఉప్పల్ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కి కమలం పువ్వుకు ఓట్లు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరుతూ హెచ్.బి కాలనీలో బిజెపి సీనియర్ నాయకులు మునుగంటి రామ్ ప్రదీప్ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధి ని వివరిస్తూ బీజేపీ పార్టీ కి ఓటు వేసి ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కి ఓట్లు భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ని కూడా నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.