తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
ఎన్నికల పోరుకు మరో ఆరు రోజులే సమయమున్న నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాసేపట్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు అబ్రహం గాంధీభవన్‌కు బయలుదేరారు.