తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. ఎవరు నడమవన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అంటూ విజయసాయి ఈ ఉదయం ట్వీట్ చేశారు. యువగళం పాదయాత్రలో నడక భారమై లోకేశ్ బిత్తర సవాళ్లు విసురుతున్నాడని విజయసాయి ఎద్దేవా చేశారు. గాలికుంటు, బ్లూటంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబూ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. మీ అల్లుడు నత్తి పకోడీగాడిని అప్పుడు ఎవరు నడవమన్నారు దొంగ సాయి? అని అయ్యన్న ప్రశ్నించారు. కనిపించినవాళ్లకల్లా ముద్దులు పెట్టి, మూతులు నాకి మీ అల్లుడు ఎందుకు చేశాడురా పాడెయాత్ర అని దుయ్యబట్టారు. నడవలేక కోర్టు వాయిదాల పేరుతో యాత్రని వాయిదా వేసుకోవడం మీ దొంగల్లుడికే చెల్లు అని అన్నారు. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని, అధికారం పోతే నీ బతుకేంటో తెలియక మెదడువాపు వ్యాధి వచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్న దొంగసాయి…