తెలంగాణ వీణ , సినిమా : “1992లో నేను ‘లో బ్యాండ్’ ఎక్విప్ మెంట్ తో ‘గ్రీన్ మ్యాట్’ స్టూడియో పెట్టాను. అందుకు నాకు 30 లక్షలు ఖర్చు అయింది. అప్పుడు నేను దూరదర్శన్ లో 6 సీరియల్స్ చేస్తున్నాను. ఆ వర్క్ నా స్టూడియోలో నడుస్తుందని నేను భావించాను. కానీ ‘హై బ్యాండ్’ ఎక్విప్ మెంట్ లో మాత్రమే చేయాలనే ఒక నిబంధన పెట్టారు. దాంతో నా బిజినెస్ పేకమేడలా కూలిపోయింది” అన్నారు.
“ఆ బిజినెస్ వలన నేను 30 లక్షలు నష్టపోయాను .. ఆ డబ్బును నేను బ్యాంకుకి కట్టాలి. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ, ఆ అప్పు తీర్చలేను. నాలుగున్నరేళ్లు కష్టపడి అప్పుతీర్చాను. ఆ తరువాత ‘జీరో’ నుంచి మళ్లీ జీవితం మొదలెట్టాను. నా దర్శక నిర్మాణంలో వచ్చిన ‘చాణక్య’ నుంచి మళ్లీ పుంజుకున్నాను” అంటూ చెప్పారు.