తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : గంటల వ్యవధిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసులు బందోబస్తు కోసం భారీ బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతీ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సికింద్రాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్లా రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ లో 2 లక్షల 62 వేల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 102 కేంద్రాల్లో 220 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎటువంటి వత్తిల్లకు లోను కావద్దని స్వఛ్చందంగ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
Tweetఎన్నికలకు రంగం సిద్ధం pic.twitter.com/zwk9kD7ihH
— GS9TV Telugu News (@Gs9tvNews) November 29, 2023